Kingdom : విజయ్ దేవరకొండ చేస్తున్న లేటెస్ట్ మూవీ రిలీజ్ కు దగ్గర పడింది. జులై 31న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా అనుకున్నప్పుడు కథ చాలా నచ్చింది. దాన్ని విజువల్ రూపంలోకి తీసుకురావడంపైనే ఇన్నేళ్లు కష్టపడ్డాం. ఇది నా ఒక్కడి కష్టమే కాదు. మూవీ ఇంత బాగా రావడానికి గౌతమ్ తిన్నమూరి, అనిరుధ్, ఎడిటర్ చాలా కష్టపడ్డారు. తమిళ్ లో టీజర్ అంత వైబ్ రావడానికి సూర్య అన్న మొదటి కారణం అయితే అనిరుధ్ రెండో కారణం అన్నారు విజయ్.
Read Also : Prabhas : పవర్ ఫుల్ గా ఉంది.. మహావతార్ పై ప్రభాస్ ప్రశంసలు
ఈ సినిమా కోసం అనిరుధ్ చాలా కష్టపడ్డాడు. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. అతనితో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ మూవీతో అది తీరింది. అతని వర్క్ విజన్ చూస్తుంటే కిడ్నాప్ చేసి నాతోనే ఉంచుకోవాలని అనిపిస్తోంది. ఈ సినిమా విజయం నా కంటే వాళ్లకే ఎక్కువగా చెందుతుంది. అందుకే ఈ మూవీ నా ఒక్కడితే కాదు. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు నచ్చేలా చేయాలనుకుంటా. అందుకే వందశాతం కష్టపడుతాను. ఈ మధ్య కథలను ఎంచుకోవడంపైనే దృష్టిపెడుతున్నా. మనం ఎంత కష్టపడ్డా కథ బాగుంటేనే ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న నిర్వహించారు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
Read Also : Thelusukada : ‘తెలుసుకదా’ నుంచి మల్లిక గంధ సాంగ్ రిలీజ్..