Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. మొన్న విజయ్ దేవరకొండకు లెజెండరీ కాంతారావు అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును విజయ్ కు అందజేసింది. దీనిపై విజయ్ ఇప్పటికే తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే తాజాగా ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అందిస్తూ ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చాడు.
Read Also : Multi Level Parking : ఒకేసారి 72 కార్ల పార్కింగ్.. కేబీఆర్ పార్క్ వద్ద కొత్త టెక్నాలజీ..
నేను సాధించే ప్రతి అవార్డు ముందు వారికే సొంతం. ఆ తర్వాత నన్ను ఆదరిస్తున్న వారికి దక్కుతుంది. అంటూ రాసుకొచ్చాడు. ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ తల్లిదండ్రులు అవార్డును పట్టుకుని మురిసిపోతున్నారు. ఇది చూసిన విజయ్ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాతో రాబోతున్నాడు. జులై 4న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ హరిహర వీరమల్లు ఆ డేట్ కు వస్తే కింగ్ డమ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతి త్వరలోనే రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also : The Rajasaab : టీజర్ లో ఆ లుక్ లేదు.. కారణం అదేనా..?
https://www.facebook.com/story.php?story_fbid=1266317221524148&id=100044376461374&rdid=gHh6i8J8Kz0XrgCm#