పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రేంజ్‌లో విజయ్ దేవరకొండకి ఒక్క సినిమా పడితే చూడాలని చాలా కాలంగా రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే… లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేద్దాం, వాట్ లాగా దేంగే అని చెప్పిన విజయ్ దేవరకొండ, ఊహించని ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఒక టయర్ 2 హీరో ఆ రేంజ్ డిజాస్టర్ ఇస్తే అసలు నెక్స్ట్ సినిమా అనే మాటే ఉండదు కానీ విజయ్ విషయంలో మాత్రం అలా జరగట్లేదు. లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తున్నాడు. లైగర్ రిజల్ట్ తో సంబంధం లేకుండా నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు రౌడీ హీరో. ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణతో కలిసి ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంతతో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో ఖుషి రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసేశాడు రౌడీ. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత రౌడీ మరో టాలెంటెడ్ డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
గతంలో యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌తో ‘టాక్సీవాలా’ సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. చివరగా నానితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు రాహుల్. దీని తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రౌడీ కోసం రాహుల్ పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేసినట్టు తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని టాక్. ఇప్పటికే రాహుల్ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్లతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. VD 13 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే, విజయ్-రాహుల్ కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.