Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంటూనే కొత్త సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. వీలైనప్పుడల్లా మూవీ గురించి ప్రస్తావిస్తూనే ఉంటున్నాడు. తాజాగా ఆయన ‘ఫిలింఫేర్ మేగజైన్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను సినిమాల విషయంలో ఎప్పుడూ డైరెక్టర్లనే ఫాలో అవుతాను. వారు చెప్పిందే చేస్తాను. అదే ఏదైనా సరే వెనకాడను. సందీప్, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్ లు నా కెరీర్ కు ఊతం ఇచ్చారు.
Read Also : Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 గంటల్లో 146 మంది మృతి
ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతానికి కెరీర్ మీదనే ఫోకస్ పెడుతున్నా. రష్మిక చాలా మంచి అమ్మాయి. ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఆమె అద్భుతంగా నటించే అందమైన నటి’ అంటూ చెప్పాడు విజయ్. ‘రష్మికలో మీకు కాబోయే భార్య లక్షణాలు ఉన్నాయా’ అంటూ రిపోర్టర్ ప్రశ్నించారు.
దానికి విజయ్ స్పందిస్తూ.. ‘మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరైనా ఓకే’ అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. విజయ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. ముందు రష్మికను మంచి అమ్మాయి అన్నాడు. ఆ తర్వాత మంచి మనసు ఉన్న అమ్మాయినే చేసుకుంటా ఎవరైనా సరే అంటూ రష్మిక గురించి హింట్ ఇచ్చేశాడు. ఒకవేళ రష్మికతో కాకపోయి ఉంటే.. దాన్ని క్లియర్ గా చెప్పేసేవాడు కదా అంటున్నారు ఆయన ఫ్యాన్స్. మొత్తానికి రష్మికతో రిలేషన్ ను ఇన్ డైరెక్ట్ గా విజయ్ ఒప్పేసుకుంటున్నాడని ఆయన అభిమానులు చెబుతున్నారు.
Read Also : Asaduddin Owaisi: పాకిస్తాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు..