సామ్, చై విడాకులపై వెంకటేష్ కామెంట్

క్రేజీ కపుల్ నాగ చైతన్య, సమంతల విడాకుల విషయం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత శనివారం వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్ల నుంచి చక్కర్లు కొడుతున్న రూమర్స్ కు చెక్ పెడుతూ విడాకుల విషయాన్ని ప్రకటించి నాలుగేళ్ళ పెళ్ళి బంధానికి ముగింపు పలికారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే తాము భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని, తమ ప్రైవసీకి ఇబ్బంది కలిగించొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా మీడియాను, అభిమానులను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు చై, సామ్. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా దానికి వ్యతిరేకంగా ఉంది. చై-సామ్ విడాకుల విషయం అనౌన్స్ చేసినప్పటి నుంచీ దానికి కారణం ఏంటని ? ఆరా తీస్తూనే ఉన్నారు. అంతేనా ఇదే కారణం అంటూ లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి.

Read Also : “ఫన్ అండ్ ఫ్రస్టేషన్”లో ఐకాన్ స్టార్… సెట్ లో హంగామా

చై-సామ్ ఆ వార్తలపై స్పందించలేదు. కానీ వీరి విడాకుల విషయంపై సీనియర్ హీరో, నాగ చైతన్య మామ విక్టరీ వెంకటేష్ స్పందించారు. ఇన్స్టా వేదికగా ఓ సెటైరికల్ పోస్ట్ చేశారు. ఇన్‌స్టా స్టోరీలో వెంకటేష్ “నోరు తెరవడానికి ముందు మనస్సు తెరవండి” అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూస్తుంటే నోరు తెరిచే ముందు ఆలోచించి, సామ్-చైలను ప్రశాంతంగా వదిలేయాలని అందరికీ వెంకీ మామ గట్టిగానే సమాధానం చెప్పాడు అన్పిస్తుంది.

-Advertisement-సామ్, చై విడాకులపై వెంకటేష్ కామెంట్

Related Articles

Latest Articles