హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా సార్లు ప్రచారాలు జరిగాయి. దానికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే చోట ఉండగా, బ్యాక్ గ్రౌండ్ మ్యాచ్ అవుతూ ఉండగా షేర్ చేసిన ఫోటోలను కూడా నెటిజన్లు గుర్తు పట్టేసే వారు. ఇంకేముంది వెంటనే సోషల్ మీడియాలో మళ్ళీ దొరికేశారు అంటూ చర్చలు జరుపుతూ ఉండేవారు. ఇలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. పరశురామ్ దర్శకత్వంలో మృణాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ వీడియో మాట్లాడుతూ విజయ్ దాన్ని రిలీజ్ చేశాడు. ఇక అదే బ్యాక్ గ్రౌండ్ లో నెమళ్ళు కనిపిస్తున్నాయి. ఆ నెమళ్ళని రష్మిక ఫోటో తీసి అద్భుతంగా ఉంది అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంటే ఇక్కడ కూడా బ్యాక్ గ్రౌండ్ ఒకటేలా కనిపిస్తోంది.
Tollywood Movies : ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోతున్న సినిమాలు ఇవే..
తాజాగా అందుతున్న సమాచారం మేరకు విజయ్ దేవరకొండ రష్మిక మందన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దుబాయ్ లోని ఒక రిసార్ట్లో రష్మిక సన్నిహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని, ఈ వేడుకలకు విజయ్ కూడా హాజరు కాబోతున్నాడని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏప్రిల్ 5వ తేదీన ఆయన సినిమా రిలీజ్ అవుతుండగా అదే రోజు రష్మిక పుట్టినరోజు జరుపుకుంటోంది. మొత్తం మీద ఈ అంశం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటివరకు ఈ విషయం మీద అటు రష్మిక కానీ ఇటు విజయ్ దేవరకొండ గాని స్పందించలేదు. దీంతో ఈ దాగుడుమూతలు ఎందుకు అఫీషియల్ గా ప్రకటించి వేయొచ్చు కదా అంటూ చాలామంది అభిమానులు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.