Vijay Devarakonda : తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న మూవీ రెట్రో. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మే 1న వస్తున్న ఈ సినిమాన తెలుగులో నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరొకొండ మాట్లాడారు. ‘సూర్య అన్న సినిమాకు అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. సూర్య సినిమాలు చూసి ఇతనేంట్రా ఇలా యాక్టింగ్ చేస్తున్నాడు అని షాక్ అయిపోయాను. కానీ సూర్య అన్న సినిమాలు చూసి చాలా ఇన్ స్పిరేషన్ ఫీల్ అవుతాను. ఆయనలా సినిమాలు చేయాలని నాకు ఎంతో ఉంటుంది.
Read Also : Shekhar Master : జానులిరితో నాకు ఎలాంటి రిలేషన్ లేదు.. శేఖర్ మాస్టర్ క్లారిటీ..
సూర్య అన్న అగరం ఫౌండేషన్ తో ఎంతో మంది చిన్నారులకు అండగా ఉంటున్నారు. ఆయనను ఒక్కసారి కలవాలని ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయనతో కలిసి స్టేజి పంచుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన లాంటి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఆయన సినిమాలు నేను ఎప్పుడూ చూస్తుంటాను. ఆయన నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ నాకు మనసుకు బాగా నచ్చిన మూవీ. అందులోని చంచల సాంగ్ ఇప్పటికీ నా ఫేవరెట్. రెట్రో సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీతో అన్నకు మంచి పేరు రావాలి’ అంటూ కోరాడు విజయ్ దేవరకొండ.