Vijay Deverakonda Father Comments on Abhishek Nama: విజయ్ దేవరకొండ ఈ మధ్యనే అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే ఖుషి చిత్ర సక్సెస్ మీట్ లో హీరో విజయ్ దేవరకొండ తన అభిమానుల కుటుంబాలకు కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయం మీద అభిషేక్ పిక్చర్స్ సంస్థ సెటైర్ వేస్తూ మీది మంచి హృదయం, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో రూ.8 కోట్లు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ని కూడా ఆదుకోండి, ఆ డబ్బులు కూడా చెల్లించండి అని ట్వీట్ చేశారు. ఈ విషయం మీద విజయ్ అభిమానులు మాత్రమే కాదు సినీ అభిమానులు సైతం అభిషేక్ పిక్చర్స్ తీరుపై మండిపడ్డారు. ఇక అంశం మీద విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు తాజాగా స్పందించారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామాపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్ కావడంతో విజయ్ దేవరకొండ హాఫ్ రెమ్యూనరేషన్ నిర్మాతలకు తిరిగిచ్చేశాడని పేర్కొన్న ఆయన ముందుగా వాళ్ళు ఆఫర్ చేసిన ఫ్లాట్ కూడా తీసుకోలేదని అన్నారు. ఇంతకంటే ఎవరు మాత్రం చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
Chandrababu Arrest: కంటతడి పెట్టుకున్న నందమూరి రామకృష్ణ
డబ్బు ఏమైనా నష్టపోతే మీరు నిర్మాతను అడగాలని అన్నారు. అయితే అభిషేక్ నామా కొన్నాళ్లుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించిన ఆయన ఆ విషయం విజయ్ దేవరకొండకు కూడా తెలియదన్నారు. ఇక ఆర్థిక పరమైన వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కానీ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అభిషేక్ నామా విజయ్ దేవరకొండను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు కానీ అతని పప్పులు ఉడకవని అన్నారు. ఒకసారి విజయ్ మార్కెట్ పడిపోయిందని అంటాడు, మళ్ళీ అతనే విజయ్ డేట్స్ కావాలని అంటాడు ఇలా బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని ఏమీ చేయలేడని ఆయన అన్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో సినిమాలు చేసేందుకు సంతకం చేశాడు కాబట్టి ఆయన డేట్స్ ఖాళీగా లేవన్న ఆయన ఒకవేళ కాళీ ఉన్నా అభిషేక్ నామా లాంటి వ్యక్తితో మాత్రం విజయ్ సినిమాలు చేయడని చెప్పుకొచ్చాడు.