విజయ్ దేవరకొండ చిన్న చిన్న పాత్రల పరిధి నుండి ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. తన కృషి, సినిమాలపై తనకున్న ఇష్టం, పట్టుదలతో టాలీవుడ్లో ఎటువంటి గాడ్‌ఫాదర్ లేకుండానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ ‘లైగర్’ ద్వారా మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశించాడు. ఈ యంగ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కంటే ముందే ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ రౌడీ స్టార్ కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో త్వరలో సినిమా చేయనున్నాడు. ఇక విజయ్ సినిమాలతో మాత్రమే కాకుండా ఎండార్స్‌మెంట్స్‌తో కూడా దూసుకుపోతున్నాడు.
Read Also : పవన్ కళ్యాణ్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఆర్జీవీ
వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత యాడ్స్, బ్రాండింగ్ వంటి వాటికి ముందుండేది రౌడీ స్టారే. లేటెస్ట్ అప్డేట్ల ప్రకారం మహేష్ బాబు చేస్తున్న ఓ పాపులర్ యాడ్ లో విజయ్ దేవరకొండ కన్పించాడు. కొన్నేళ్లుగా మహేష్ ‘థమ్స్ అప్’యాడ్ లో కనిపిస్తున్నాడు. కొత్తగా ఈ ప్రకటనను బాలీవుడ్ హీరో రణ్వీర్, సింగ్ మహేష్ బాబుపై చిత్రీకరించారు. ఇది ఇప్పటికే టీవీల్లో ప్రసారమవుతోంది. అయితే తాజాగా ఈ ప్రకటనలో మహేష్ బాబు బదులుగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ యాడ్ విజయ్ చేతికి వచ్చింది. దీనికోసం విజయ్ ఏకంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ పేరును కూడా మార్చుకున్నాడు. “విజయ్ దేవరకొండ తుఫాన్”గా ట్విట్టర్ లో పేరు చేంజ్ చేసుకున్నాడు. ఇక యాడ్ కూడా ట్విట్టర్ లో తుఫాన్ సృష్టిస్తోంది.