Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విజయ్ ఇంట్లో ఎంత పెద్ద విషాదం జరిగిందో కూడా అందరికి తెలిసిందే. విజయ్ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది. ఆ బాధనుంచి విజయ్ కుటుంబం బయటకు రాలేకపోతుంది. నిత్యం విజయ్ భార్య.. కూతురును తలుచుకొని ఎమోషనల్ పోస్ట్స్ పెడుతూనే ఉంది. ఇక కూతురు పోయిన బాధను దిగమింగుకొని విజయ్ ఆంటోని.. తన తదుపరి సినిమాలను పూర్తిచేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం హిట్లర్. ధన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ సరసన రియా సుమన్ కథానాయిక నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ మొత్తాన్ని యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారు. బిచ్చగాడు లుక్ లోనే విజయ్ కనిపించాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో కూడా విజయ్ ఆంటోనీ ఒక మెసేజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.. ఒక కిల్లర్.. ఒక డిక్టేటర్.. ఒక చేజ్.. ఒక టార్గెట్ అని రాసుకొచ్చారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక హిట్లర్ అనగానే తెలుగువారికి చిరు సినిమా గుర్తొస్తుంది చెల్లెళ్లను అపురూపంగా చూసుకొనే అన్నయ్య.. వారిని పెంచడానికి హిట్లర్ గా మారిన కథగా ఆ సినిమాను తెరకెక్కించారు. మరి విజయ్ ఆంటోనీ మెగాస్టార్ టైటిల్ తో ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.