Vignesh Shivan:కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ఇటీవలే కవల పిల్లలకు తల్లిదండ్రులయిన విషయం విదితమే. అయితే సరోగసీ ద్వారా ఈ జంట పేరెంట్స్ గా మారారని ఆరోపణలు ఉన్నాయి. ఇక తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరించాలని తమిళనాడు ప్రభుత్వం కూడా ఆదేశించిన విషయం కూడా తెల్సిందే. గత మూడు రోజులుగా ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. సరోగసీని ఇండియాలో బ్యాన్ చేశారు.. అయినా నయన్ చట్ట వ్యతిరేకంగా సరోగసీ ద్వారా తల్లి అయ్యింది.. ఆమెకు శిక్ష పడుతోంది అని కొందరు.. ఎలాగైనా తల్లిదండ్రులు అయ్యారు.. మీకు శుభాకాంక్షలు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
బయట ఇంత రచ్చ జరుగుతున్నా ఈ జంట ఇప్పటివరకు నోరువిప్పింది లేదు. ఇక తాజాగా విగ్నేష్ శివన్ ఈ వివాదంపై ఇన్ డైరెక్ట్ గా సమాధానం ఇచ్చేశాడు. “సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ నిన్ను చేరతాయి. అప్పటివరకూ సహనంతో వేచి ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు” అని అర్ధం వచ్చే కోట్ ను పోస్ట్ చేశాడు. దీంతో సమయం వచ్చినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది అనేది మాత్ర ఎవరికి తెలియదనే చెప్పాలి.