Victory Venkatesh- Anil Ravipudi – Dil Raju Movie Announced: బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి విక్టరీ వెంకటేష్ – బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి రెండు హిట్‌లను అందించిన తర్వాత విజయవంతమైన హ్యాట్రిక్ కోసం మళ్లీ జత కట్టనున్నారు. ఈ ఇద్దరూ కలిసి F2 మరియు F3 సినిమాలు చేయగా, అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ 3వ సినిమాను ఉగాది సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. 7 బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత, అనిల్ రావిపూడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో 6వ సారి ప్రొడక్షన్ నెం. 58 కోసం పని చేస్తున్నారు.
Naga Bandham: కేజీఎఫ్ నటుడితో నాగబంధం.. ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే!
ఒక వీడియో ద్వారా ప్రకటించినట్లుగా, ఈ కొత్త చిత్రం ఒక అసాధారణమైన ఒక ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్, మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది- కథానాయకుడు, అతని మాజీ ప్రియురాలు అలాగే అతని భార్య కేరెక్టర్లు ప్రధానంగా ఉండనున్నాయి. ఇక వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు, ఈ ముగ్గురూ ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన నేపథ్యంలో, వీరి కాంబినేషన్‌లో మరో సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా, అనిల్ రావిపూడి మరియు SVC కూడా సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇక భారీ బడ్జెట్‌తో భారీ బడ్జెట్‌తో, అత్యద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో రూపొందనున్న ఈ చిత్రానికి ధమాకా స్వరకర్త భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే సంక్రాంతికి తన సినిమాలు ఉండవని ప్రకటించిన దిల్ రాజు మరో సినిమాను వచ్చే సంక్రాంతికి రెడీ చేస్తున్నారు.