ఇండియాలో యాక్టింగ్ స్కిల్స్ పీక్ స్టేజ్ లో ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే టాప్ ప్లేస్ లో ఉండే స్టార్స్ ఎన్టీఆర్, ధనుష్. నటనకి నిలువెత్తు నిదర్శనంలా ఉండే ఎన్టీఆర్, ధనుష్ లు చెయ్యలేని పాత్ర అనేదే లేదు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని ఆన్ స్క్రీన్ ఫుల్ త్రొటెల్ లో చూపించగలిగే ఎన్టీఆర్, ధనుష్ లని ఛాలెంజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్. ఒక కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో దిట్ట. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. గత పదహారు సంవత్సరాల్లో కేవలం అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి, ఇందులో మూడు సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అంటే వెట్రిమారన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అతి తక్కువ బడ్జట్ లో ‘కాకా ముట్టై’ అనే సినిమా తీసి దాన్ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకోని వెళ్లిన వెట్రిమారన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందుకు రెండు కారణం ఎన్టీఆర్-ధనుష్ లతో వెట్రిమారన్ ఒక సినిమా చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే. కోలీవుడ్ టాప్ మోస్ట్ క్రిటిక్స్ కూడా ఈ నేషనల్ అవార్డ్ గ్యారెంటీడ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది అంటూ అఫీషియల్ గా పోస్ట్ చేస్తున్నారు. 2024లో సెట్స్ పైకి వెళ్తుంది అంటూ ట్వీట్స్ కూడా చేస్తున్నారు. రెండు భాగాలుగా వెట్రిమారన్, ఎన్టీఆర్, ధనుష్ ల సినిమా రానుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెట్రిమారన్-ధనుష్ కాంబినేషన్ లో సినిమా అంటేనే నేషనల్ అవార్డ్ ఇచ్చెయ్యండి అనే రేంజ్ కాన్ఫిడెన్స్ ఆడియన్స్ లో ఉంటుంది. ఈ ఇద్దరికీ ఎన్టీఆర్ కూడా కలిస్తే అది అగ్నికి వాయువు తోడైనట్లే అవుతుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ పై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని కూడా అంటున్నారు. ఇదే జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి, ఉన్న అవార్డులన్నీ సొంతం చేసుకోవడానికి మరో పాన్ ఇండియా సినిమా సౌత్ నుంచి రెడీ అయినట్లే.