Kota Srinivasa Rao : సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నలభై ఏళ్లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన కోట.. కామెడీ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. సెంటిమెంటల్, యాక్షన్, కామెడీ, విలనిజం.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఆయన స్పెషాలిటీ. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు.. అంతకు ముందు బ్యాంక్ లో ఉద్యోగం చేసేవారు. తన తండ్రి వృత్తిరీత్యా డాక్టర్. కోటను కూడా డాక్టర్ గా చూడాలని తన తండ్రి అనుకున్నారంట.
Read Also : Kota Srinivasa Rao Biography: కోట శ్రీనివాసరావు ప్రస్థానం ఇలా..!
అనుకోకుండా బ్యాంక్ జాబ్ రావడంతో అందులోనే సెటిల్ అయిపోయారు కోట. కానీ కాలేజీ రోజుల్లో నుంచే ఆయనకు నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. అప్పుడే నాటకాలు వేస్తూ పేరు తెచ్చుకున్న కోట.. బ్యాంక్ జాబ్ వచ్చాక నటనకు దూరం అవుతున్నానని బాధపడ్డారు. 1968లో రుక్మిణీ దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత నటనపై మరింత మమకారం పెరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత అంటే 1978లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రాణం ఖరీదు సినిమాతో తన నట ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాంక్ జాబ్ వదిలేసి పూర్తిగా సినిమాలకే అంకితం అయిపోయారు. వందలాది సినిమాల్లో నటించి తిరుగులేని ఖ్యాతిని సంపాదించుకున్నారు. చివరి రోజుల్లో చిన్న పాత్రల్లో నటించినా.. వాటికి ప్రాణం పోసి తన సత్తా ఏంటో చూపించారు. అనారోగ్య సమస్యలతో జీవిత చరమాంకంలో చాలా ఇబ్బందులు పడ్డారు కోట.
Read Also : Anantapur Murder: అల్లుడిని హత్య చేయించిన మామ.. తల, మొండెం వేరు చేసి మరీ..