గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్… విక్రమ్ వేద సినిమాలో ప్లే చేసిన వేద క్యారెక్టర్ కి చాలా మంచి పేరొచ్చింది. తనలోని యాక్టర్ కి నెగటివ్ టచ్ ఇచ్చి కొత్తగా ప్రెజెంట్ చేసిన హ్రితిక్ రోషన్ కి ‘ఐఫా’లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. అబుదాబిలో జరుగుతున్న అవార్డ్స్ ఈవెంట్ లో హ్రితిక్, ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఐఫా ఈవెంట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన హ్రితిక్ రోషన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. “ఫైటర్ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. వార్ 2 రెడీ అవుతోంది. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నా…” అని హ్రితిక్ చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హ్రితిక్ రోషన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే రోజున కూడా హ్రితిక్ రోషన్ ‘యుద్ధ భూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మిత్రమా’ అని ట్వీట్ చేసి వార్ 2 సినిమాని కన్ఫర్మ్ చేసాడు.
ఎలాంటి రోల్ లో అయినా ఈజీగా పెర్ఫార్మ్ చెయ్యగల ఈ హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి యాక్టర్స్ ని ఒకేసారి తెరపై చూడడం మంచి కిక్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నటన మాత్రమే కాదు డాన్స్ విషయంలో కూడా ఎవరూ తగ్గకుండా పోటీ పడగల సత్తా ఈ ఇద్దరి సొంతం. ఇలాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తుంటే ఎలా ఉంటుందో తెలియాలి అంటే వార్ 2 వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ‘వార్ 2’ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.