Narne Nithin: ఒక స్టార్ కుటుంబం నుంచి కొత్త హీరో వస్తున్నాడు అంటే.. ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా హీరో అయితే.. కథ కుటుంబానికి నచ్చాలి. డైరెక్టర్ నచ్చాలి అని చెప్పుకురావడం చాలాసార్లు వింటూనే వచ్చాం. ఇక తమ కుటుంబం నుంచి హీరోను పరిచయం చేయడానికి స్టార్లు సైతం తమవంతు కృషి చేస్తారు. అయితే.. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ విషయంలో ఇవేమి జరగకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు అభిమానులు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి స్వయానా తమ్మడు నార్నే నితిన్. గతేడాది శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పుకొచ్చారు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటివరకు ఆజాపజా లేకుండా పోయింది. ఇక ఈ సినిమా గురించి పక్కన పెడితే .. ఈ మధ్యనే నితిన్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తన రెండవ సినిమాను ప్రాకటించాడు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ నేపథ్యంలోనే నితిన్ కు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ గా మారింది.
Monica Bedi: ఆ హీరో.. రా.. అనగానే వెళ్లి ఉంటే.. అవకాశం వచ్చేది
నితిన్..బావ ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండానే హీరోగా సెటిల్ అవుదామనుకుంటున్నాడట.. ఇప్పటివరకు నితిన్ చేస్తున్న సినిమాలకు సంబంధించిన ఏ వివరాలు ఎన్టీఆర్ కు తెలియదని టాక్.. బావ పేరును వాడకుండా గీతా ఆర్ట్స్ లో జరిగే ఆడిషన్స్ కు వెళ్లి.. అల్లు అరవింద్ ను మెప్పించి ఛాన్స్ పట్టేసాడట నితిన్. ఒకరకంగా నితిన్ చేస్తుంది కూడా మంచి పనే చెప్పాలి. ఎన్టీఆర్ పేరును కానీ, అతని రేంజ్ ను కానీ, వాడి ఉంటే ఈపాటికి మనోడు స్టార్ హీరో రేంజ్ లో వరుస అవకాశాలు అందుకొనేవాడు. అలా కాకుండా తన ట్యాలెంట్ తోనే పైకి రావాలని కోరుకుంటున్నాడట. ఇక నితిన్ ఇలా చేయడం మంచి విషయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాలతో నార్నే నితిన్ హిట్ అందుకుంటాడా..? లేదా.. ? అనేది చూడాలి.