బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారుతున్న సంగతి తెల్సిందే.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించిన అమ్మడు ఎట్టకేలకు వివాహంతో అతడి చెంతకు చేరనుంది. వీరి పెళ్లి అతికొద్ది బంధువులు.. ఇంకొంతమంది ప్రముఖల మధ్య ఈ నెలలో జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ లో క్యాట్- విక్కీల పెళ్ళికి అంతా సిద్ధమవుతున్నాయి. ఇక తాజగా ఈ జంట పెళ్లి పత్రికలను పంచే పనిలో పడ్డారంట .. చాలా ముఖ్యమైన గెస్టులను మాత్రమే కత్రినా పిలవనున్నదట.. ఇక టాలీవుడ్ లో అమ్మడు పిలిచిన అతికొద్దిమందిలో విక్టరీ వెంకటేష్ ఒకరు అంట.. ఇప్పటికే కత్రినా, వెంకీమామకు ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు సమాచారం.
వెంకటేష్ ‘మల్లీశ్వరి’ చిత్రంతోనే కత్రినా టాలీవుడ్ కి పరిచయమయ్యింది. ఈ సినిమా తరువాత కత్రినా తెలుగు అభిమానులకు దగ్గరయింది. ఇక ఈ సినిమా సమయంనుంచి వెంకీమామకు కత్రినాకు మంచి స్నేహం ఉందని, అందులోను తన కెరీర్ ని మార్చిన హీరోగా వెంకటేష్ ని ఆమె అభిమానిస్తున్నదని అందుకే స్పెషల్ గెస్ట్ ల ఖాతాలో వెంకీమామను యాడ్ చేసి పెళ్లికి పిలిచినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ నుంచి క్యాట్ పెళ్ళికి ఆహ్వానం అందిన మొదటి హీరో వెంకీమామే అవుతాడు.