Venkatesh: దగ్గుబాటి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దివంగత మూవీ మొఘల్ రామానాయుడు తమ్ముడు, హీరో వెంకటేష్ బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు మంగళవారం తుదిశ్వాస విడిచారు. దగ్గుబాటి మోహన్ బాబు వయస్సు 73. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన బాపట్లలోని ఆయన స్వగృహంలో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియడంతో దగ్గుబాటి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక బాబాయ్ మృతి వార్త తెలుసుకున్న సురేష్ బాబు.. తన చిన్న కొడుకు అభిరామ్ తో కలిసి బాపట్లలోని కారంచేడు వెళ్లి.. బాబాయ్ కు నివాళులు అర్పించారు.
Hrithik Roshan: బాలీవుడ్ గ్రీకువీరుడు.. చివరికి ఆమె చెప్పులు మోస్తూ..
వెంకటేష్ షూటింగ్ లో ఉన్న కారణంగా ఆయన వెళ్లలేదని సమాచారం. అయితే వెంకటేష్ తన కుటుంబంతో సహా రేపు ఉదయం కారంచేడుకు చేరుకొనే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. రేపు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక మోహన్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామానాయుడు, మోహన్ బాబు మధ్య మంచి అనుబంధం ఉండేదని, వారిద్దరూ కూడా ఒకే మాట మీద ఉండేవారని ఇండస్ట్రీలో చెప్పుకొస్తున్నారు.