Hrithik Roshan: ఎంతవారు కానీ, వేదాంతులైన కానీ.. వాలు చూపు సోకగానే తేలిపొదురోయ్ .. కైపులో అని ఏ మహాకవి రాశాడో కానీ.. అది అక్షర సైతం. ఎంత స్టార్ హీరోలు అయినా.. ప్రపంచాన్ని ఏలే రాజులే అయినా ప్రియురాలి ముందు, భార్య ముందు తగ్గాల్సిందే. దీనికి ఎవరు అతీతులు కాదు. మొన్నటికి మొన్న భార్య షాపింగ్ లు మోస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించి అందరి చేత.. ఔరా అని అనిపించాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ఇంకొంచెం ముందుకు వెళ్లి ప్రియురాలి చెప్పులు మోస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఏంటి నిజమా.. అంటే.. ఫోటో అంత క్లియర్ గా కనిపిస్తుంటే నిజమా అంటారేంటి. బాలీవుడ్ గ్రీకువీరుడుగా పేరు తెచ్చుకున్న హృతిక్ తన భార్య సుసానే ఖాన్ తో విడిపోయి.. మోడల్, నటి అయినా సబా ఆజాద్ తో ప్రేమలో పడిన విషయం తెల్సిందే. మాజీ భార్యతో విడిపోయినా ఇద్దరు ఫ్రెండ్స్ లానే కలుసుకుంటూ ఉంటారు. అదే విడ్డూరం అంటే.. మాజీ భార్య ప్రియుడు, తన ప్రియురాలు మొత్తం కలిసి పార్టీ కూడా చేసుకుంటారు. ఇదెక్కడి విచిత్రం రా బాబు అని నెటిజన్లు ఎన్ని కామెంట్స్ పెట్టిననా మేమంతా ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు
హృతిక్, సుసానే.
Swastika Mukherjee: ఆ నిర్మాత నా నగ్న ఫోటోలను పోర్న్ వెబ్ సైట్ లో పెడతానని బెదిరించాడు
ఇక వీరి విషయం పక్కన పెడితే.. ఈ మధ్య జరిగిన నీతా అంబానీ ఈవెంట్ లో హృతిక్ తన ప్రియురాలు సబాను వెంటేసుకొచ్చాడు. బ్లాక్ డ్రెస్ లో హృతిక్, రెడ్ కలర్ డ్రెస్ లో సబా ఈవెంట్ లో హైలైట్ గా నిలిచారు. సబాకు డ్రెస్ డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ ఆ డ్రెస్ ను ఎలా డిజైన్ చేశాడో చూపిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఆ ఫోటోలలో ఒకటి చూపరులను తెగ ఆకర్షిస్తుంది. సబా, అమిత్ కలిసి దిగిన ఫోటో వెనుక హృతిక్, సబా హీల్స్ ను ఎంతో జాగ్రత్తగా పట్టుకొని ముచ్చట్లు ఆడుతున్నాడు. ఈ ఒక్క ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఏ రేంజ్ హీరో.. చివరికి ప్రియురాలి చెప్పులు మోస్తున్నాడు అని కొందరు అంటుండగా .. ప్రియురాలి మీద ప్రేమ.. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ అందరికి ఉండాలి అని ఇంకొందరు అంటున్నారు.