Venkatesh: విక్టరీ వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైంధవ్. ఈ సినిమా సంక్రాంతి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో ఎలాంటి హేటర్స్ లేని హీరో అంటే వెంకీనే. ఆయన సినిమా వస్తుంది అంటే కుటుంబాలతో సహా థియేటర్స్ కాజు పరిగెత్తుతారు. అందులోనూ ఇది వెంకీ 75 వ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ నేడు వైజాగ్ లో సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. మునెప్పెన్నడూ లేనివిధంగా వెంకీ మామ స్పీచ్ ఈ వేడుకలో ఉంది. అసలు ఫ్యాన్స్ ను హుషారు చేస్తూ.. ఎంతో హ్యాపీగా ఆయన మాట్లాడిన విధానం ఆకట్టుకుంటుంది. అంతేనా హీరోయిన్లతో కలిసి.. తన సాంగ్ కు స్టెప్స్ కూడా వేసి అలరించాడు.
ఇక ఈ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.. ” నేను ఈ ఈవెంట్ కు వచ్చింది ఏదో మాట్లాడానికి కాదు.. ముందు ఈ సౌండ్స్ వినడానికి.. నాకు, వైజాగ్ కు చాలా అవినాభావ సంబంధం ఉంది. నా కలియుగ పాండవులు షూటింగ్ కు ఇక్కడకు వచ్చాను. సుందరకాండ షూటింగ్ కు వచ్చాను. పెళ్లి కానీ ప్రసాద్.. వాడు ఇక్కడే బీచ్ లో తిరుగుతూ ఉంటాడు. పవన్ తో గోపాల గోపాల ఇక్కడే చేశాను. మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇక్కడే చేశాను. ఇక స్టీల్ ప్లాంట్ లో షూటింగ్ కోసం వచ్చిన అందరికీ థాంక్స్.. అర్ధరాత్రి 2 అవుతున్నా ఉన్నారు. ఈ సినిమా చాలా బాగా చేసాం.. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నాను. ఈసారి పండగ పండగే. మా సినిమాకు హీరో అంటే సారా పాపనే. లైఫ్ ను సీరియస్ గా తీసుకోవద్దు.. దేవుడు అందరికి అన్ని ఇస్తాడు.. కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది.