Venkatesh : విక్టరీ వెంకటేశ్ వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో వెంకటేశ్ సోలోగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇది వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ కూడా పెరిగింది. దీంతో వెంకటేశ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ లోనే ఉండాలని వెంకటేశ్ ప్లాన్ చేసుకుంటున్నాడంట. వెయిట్ చేసినా సరే మంచి కథతో సినిమా తీయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సామజవరగమన రచయితల్లో ఒకరైన నందు రాసిన ఓ కథ వెంకటేశ్ కు బాగా నచ్చిందంట.
Read Also : Priyanka Chopra : నడుము అందాలతో హీటు పుట్టిస్తున్న ప్రియాంకచోప్రా
ఇది మంచి కామెడీ బేస్డ్ గానే ఉంటుందని సమాచారం. అయితే నందుకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి ఆయన నుంచి కేవలం కథ మాత్రమే తీసుకున్నాడంట వెంకటేశ్. ప్రస్తుతం డైరెక్టర్లను వెతికే పనిలో పడ్డాడంట. హరీష్ శంకర్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా ప్లాప్ అయినా హరీష్ టేకింగ్ మీద వెంకటేశ్ నమ్మకం ఉంచుతున్నాడు. హరీష్ శంకర్ కు మంచి కథ పడితే సినిమాను బాగా తీయగలడు. ఆ నమ్మకంతోనే అతనికి సినిమా అప్పగించనున్నాడంట వెంకటేశ్. త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంట. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో ఈ గ్యాప్ లో వెంకటేశ్ తో సినిమా తీయాలని చూస్తున్నట్టు సమాచారం.