ప్రేమికుల రోజున అందరూ ప్రేమ పాటలు పాడుతుంటే… లవ్ ఫెయిల్ అయిన వాళ్ల కోసం కూడా ఒక సాంగ్ ని ఇచ్చారు ‘ఓ సాతియా’ చిత్ర యూనిట్. ఆర్యన్ గౌడా, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న ఈ మూవీని దివ్య భావన దర్శకత్వం వహిస్తున్నారు. చందన కట్ట ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘వెళ్లిపోయే’ అనే లిరికల్ సాంగ్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఫెబ్ 14న బ్రేకప్ అయిన వాళ్ల కోసం అన్నట్లు ఒక బ్రేకప్ ఏంథమ్ లా ‘వెళ్లిపోయే’ సాంగ్ బయటకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ విన్ను ఇచ్చిన కూల్ ట్యూన్ కి, భాస్కరభట్ల “మొట్టమొదటిసారి కదా ప్రేమ పుట్టడం, పిచ్చి మనసు తట్టుకోదే ఇంత దారుణం” అంటూ క్యాచీ లిరిక్స్ ని రాసాడు. మొదటిసారి వినగానే ఈ పాట హమ్ చేసేలా ఉంది అంటే దానికి కారణం భాస్కరభట్ల రాసిన లిరిక్స్ అనే చెప్పాలి.
Read Also: Sri Vishnu: బాలయ్య, అల్లు అర్జున్ ఫాన్స్ బాగా కనెక్ట్ అయ్యే టైటిల్…
ఇక ఈ సాంగ్ ని ఫీల్ ని యాడ్ చేసింది రాహుల్ సిప్లిగంజ్ వాయిస్. మాస్ సాంగ్స్ ఎక్కువగా పాడే రాహుల్, వెళ్లిపోయే సాంగ్ కి ప్రాణం పోశాడు. లిరికల్ సాంగ్ లో అక్కడక్కడా చూపించిన విజువల్స్ కూడా బాగున్నాయి. లీడ్ క్యారెక్టర్ డాన్స్ మూవ్స్ సింపుల్ గా ఉన్నా చూడడానికి బాగున్నాయి. బాబా బాస్కర్ మాస్టర్ వెళ్లిపోయే సాంగ్ ని ఎంతవరకూ డాన్స్ కావాలో అంతవరకూ పర్ఫెక్ట్ గా స్టెప్స్ ని కంపోజ్ చేశాడు. మొత్తానికి ఈ వెళ్లిపోయే సాంగ్ ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ పాడుకునేలా, ఓ సాతియా సినిమాకి మంచి ప్రమోషనల్ కంటెంట్ లా ఉపయోగ పడుతుంది.