Veera Simha Reddy Trailer: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ను వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. బాలయ్య ఊర మాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
“సీమలో ఏ ఒక్కడు కట్టి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత.. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి.. పుట్టి పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్” అంటూ బాలయ్య బేస్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. బాలయ్య మాస్ పంచులు.. యాక్షన్ సీక్వెన్స్ అయితే దుమ్ము రేపడం ఖాయం. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ విలన్స్ గా కనిపించారు. బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించినా యాక్షన్ లో మాత్రం ఇద్దరు అదరగొట్టేశాడు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వీర లెవెల్ లో ఉంది. నిజం చెప్పాలంటే బాలయ్య ట్రైలర్ తోనే హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. గోపీచంద్ మలినేని నిజమైన బాలయ్య అనిపించుకున్నాడు. జనవరి 12 న థియేటర్ లో పూనకాలు కన్ఫర్మ్ అని అభిమానులు చెప్పుకొచ్చేస్తున్నారు.