Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ఫ్రిన్స్ వరుణ్ తేజ్, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన ఒత్తిడి, బాధ్యతల గురించి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం ఒక అవకాశం మాత్రమేనని, ఆ తర్వాత తన ప్రతిభతోనే నిలబడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మొదటి సినిమా విడుదల కాకముందే అభిమానులు ‘మెగా ప్రిన్స్’ అనే పేరు పెట్టారు. ఆ ప్రేమ, అభిమానం చాలా సంతోషాన్ని ఇస్తాయి. అదే సమయంలో మెగా ఫ్యామిలీ లెగసీని కొనసాగించాలనే బాధ్యత, ఒత్తిడి కూడా ఉంటుంది” అని అన్నారు.
స్టార్ ఫ్యామిలీ నేపథ్యం కెరీర్ స్టార్టింగ్‌లో అవకాశాలు తీసుకురావచ్చు కానీ, ఇండస్ట్రీలో సొంత గుర్తింపు సాధించాలంటే కష్టపడాల్సిందేనని వరుణ్ తేజ్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ తమకంటూ ప్రత్యేకమైన స్పేస్ ఉంటుందని, తాము ఏ విషయంలో బలంగా ఉన్నామో తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పారు. “మా ఇంట్లో ఎప్పుడూ మాపై ఒత్తిడి పెట్టలేదు. వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చారు. అయితే కొన్ని విలువలు మాత్రం నేర్పించారు. మనపై నమ్మకం పెట్టి సినిమా అవకాశం ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి. సమయానికి సెట్‌కు వెళ్లాలి, పూర్తి అంకితభావంతో పనిచేయాలి. నిర్మాత ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలి” అని ఇంట్లో పెద్దవాళ్లు చెప్పినట్లు వెల్లడించారు.
Also Read
తన ఫస్ట్ సినిమా అవకాశంపై స్పందిస్తూ.. తాము ఎవరికీ ఫోన్ చేసి అవకాశం అడగలేదని, తనలోని యాక్టింగ్ టాలెంట్‌ని నమ్మి అవకాశాలు వచ్చాయని చెప్పారు. మొదటి అవకాశం కుటుంబం వల్ల రావచ్చు కానీ, ఆ తర్వాత అవకాశాలు రావాలంటే నటుడిలో ప్రతిభ ఉండాల్సిందేనని అన్నారు. “ఎంత పెద్ద దర్శకుడు అయినా, చిన్న దర్శకుడు అయినా కథకు సరిపోయే నటుడిని మాత్రమే ఎంపిక చేస్తారు. మనలో ఉన్న స్కిల్, టాలెంట్‌ను చూసే అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఎంత బాధ్యతగా తీసుకుంటామన్నదే ముఖ్యం” అని వరుణ్ తేజ్ తెలిపారు. ప్రతి సినిమాకు తాను 100 శాతం కష్టపడతానని, అవకాశం వచ్చిందనే కారణంతో దాన్ని తేలికగా తీసుకోనని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. తన నటనలో మెరుగుదలకు ప్రేక్షకుల స్పందన, సహ నటులు, సీనియర్ల సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు.
తాజావార్తలు
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!