Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి మెగాస్టార్ ఇమేజ్ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్రాథమిక చర్చలు జరిపిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు షికారు చేశాయి. గతంలో గుజరాత్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన రీతిలోనే, ఏపీ రూపురేఖలను మార్చేందుకు చిరంజీవిని రంగంలోకి దించబోతున్నారని విస్తృత ప్రచారం జరిగింది.
అయితే, ఈ ప్రచారంపై మెగాస్టార్ చిరంజీవి పిఆర్ (PR) టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది..ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి నియామకంపై ఎలాంటి చర్చలు లేదా నిర్ణయాలు జరగలేదని తేల్చిచెప్పింది. అనవసరమైన ఊహాగానాలు, ఆధారాల్లేని వార్తలను నమ్మవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీంతో గత కొద్దిరోజులుగా నెట్టింట హల్చల్ చేస్తున్న వార్తలకు తెరపడినట్లయింది.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!