VarunLav: అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసిన వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లి ఎట్టేకలకు గ్రాండ్ గా జరిగిపోయింది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. నవంబర్ 1 న భార్యాభర్తలుగా మారారు. ఇక తాము మొదట కలిసిన చోటనే పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఇటలీలో వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు గ్రాండ్ గా జరిపించారు. ఈ వివాహానికి అతికొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఇక పెళ్లి పూర్తికాగానే నేను మెగా అల్లు కుటుంబాలు ఇండియాకు బయల్దేరుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. వరుణ్ – లావణ్య పెళ్ళికి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా.. ? అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే కోట్లు ఖర్చు అవుతుంది. నాగబాబు.. కూతురు పెళ్ళికే కోట్లు ఖర్చుపెట్టాడు.. ఇక కొడుకు పెళ్ళికి అంతకంటే ఎక్కువే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది.
Bharateeyudu 2: భారతీయుడుకు చావే లేదు.. సేనాపతి తిరిగి వచ్చాడు
సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. ఈ పెళ్లి కోసం ఏకంగా రూ.15-17 కోట్ల మేర ఖర్చు అయ్యినట్లు సమాచారం. ఫ్లైట్ టికెట్స్ నుంచి షాపింగ్, వెడ్డింగ్ వెన్యూ, బంధువులు ఉండడానికి రూమ్స్, ఫుడ్, కాక్ టైల్ పార్టీ, ప్రీ వెడ్డింగ్ పార్టీ, మెహందీ, సంగీత్ తో సహా అన్ని కలుపుకొని రూ. 17 కోట్లు వరకు అయ్యి ఉంటుందని సమాచారం. ఇటలీలో వరుణ్- లావణ్య వెడ్డింగ్ వెన్యూ బుకింగ్ కే రూ. 30 లక్షలు వరకు అయ్యిందట. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఇది కేవలం పెళ్లి ఖర్చు మాత్రమే.. నవంబర్ 5 న జరగబోయే రిసెప్షన్ ఖర్చు వేరే అని టాక్. మరి ఈ రిసెప్షన్ కు ఎంత అవుతుందో చూడాలి.