మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్ బీస్ట్ లుక్‌లో ఉన్న ఈ లేటెస్ట్ పిక్స్ ఫిట్నెస్ కోసం ఆయన చేసిన కృషి, అభిరుచి గురించి తెలుపుతున్నాయి. వరుణ్ లుక్స్ కారణంగా సినిమాపై ఇప్పటికే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గని’పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పిక్స్ బయటకు వచ్చాక ఎక్కువగా మహిళా అభిమానులు ఆయనకు ఫిదా అవుతారు ఆనందంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : “పెద్దన్న” ట్విట్టర్ రివ్యూ
‘గని’లో బాక్సర్ లా కనిపించడానికి వరుణ్ తేజ్ వండర్ ఫుల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లోకి చేంజ్ అయ్యి అందరికీ షాకిచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ట్రీట్‌గా ఉంటుందని “గని” టీమ్ చెబుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రలు పోషించారు. సహాయక తారాగణంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు మరియు నవీన్ చంద్ర ఉన్నారు. డిసెంబర్ 3న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కిరణ్ కొర్రపాటి రచించి, దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా ‘గని’ని రెనైసాన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. వరుణ్ తేజ్ ‘గని’ చిత్రం విడుదలకు సరిగ్గా ఒక నెల సమయం మాత్రమే ఉంది. మెగా అభిమానులు ఈ సినిమా గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.