Varun Tej indirect counter to Siddarth Anand: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచుతోంది సినిమా యూనిట్. అందులో భాగంగానే తెలుగు, హిందీ భాషల ట్రైలర్స్ ని ఈరోజు లాంచ్ చేసింది. ఇక హైదరాబాద్ లో ఒక ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి ఆ తర్వాత మీడియాతో కూడా ముచ్చటించింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఫైటర్ సినిమా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ కి అనూహ్యంగా కౌంటర్ ఇచ్చినట్లు కనిపించారు. ఆయన కావాలని మాట్లాడలేదు కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం సిద్ధార్థ ఆనంద్ కి కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే ఫైటర్ సినిమాకి హిందీలో సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఇదే విషయాన్ని సిద్ధార్థ ఆనంద్ ని ప్రశ్నిస్తే ఆయన చాలా మంది ప్రేక్షకులు కనీసం ఏరోప్లేన్ ఎక్కిన అనుభవం కూడా లేని వాళ్ళు.
Kushitha Kallapu: నాలుగు రోజులు కష్టపడ్డా.. అయినా గుంటూరు కారంలో నన్ను లేపేశారు!
అలాంటి వాళ్ళకి ఎయిర్ ఫైటింగ్ సినిమా అంత ఈజీగా అర్థం కాదు కాబట్టే సినిమా అంతగా ఆడలేదని ఆడియన్స్ మీద నెపం వేసే ప్రయత్నం చేశారు. ఇక వరుణ్ తేజ్ ని ఆయన గత సినిమాలు అన్ని ప్రయోగాత్మకమైనవే అయినా ఎందుకు ప్రేక్షకులు సినిమాలను ఎంకరేజ్ చేయలేదని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా సిద్ధార్థ ఆనంద్ కి కౌంటర్ ఇచ్చినట్లు మాట్లాడారు వరుణ్ తేజ్. తాను సినిమా బాగానే ఉన్నా ఆడియన్స్ ఎంకరేజ్ చేయలేదు అనే కాన్సెప్ట్ నమ్మను అని చెప్పుకొచ్చాడు. తన ప్రయోగాలు ఫెయిల్ అయినప్పుడు ఆడియన్స్ ని ఎప్పుడూ తాను బ్లేమ్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఆడియన్స్ తన సినిమాని చూడలేదంటే కచ్చితంగా స్క్రిప్ట్ లో కానీ స్క్రీన్ ప్లే లో కానీ ఏదో ఒక సమస్య ఉందని తాను భావిస్తానని, ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఆయన ఉద్దేశం వేరే అయినా సరే అది సిద్ధార్థ ఆనంద్ కి కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.