Kushitha Kallapu Comments on Guntur Kaaram Movie: యూట్యూబర్ కుషిత కళ్లపు గురించి సోషల్ మీడియా యూజర్స్ అందరికి పరిచయమే. యూట్యూబ్ స్థాయి నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే కుషిత అనే పేరు కంటే.. బజ్జిల పాపగా ఈ ముద్దుగుమ్మకు పేరు ఎక్కువగా వచ్చింది. బజ్జిల పాప అంటే ఎక్కువ మంది గుర్తుపట్టేస్తారు. ఆ విషయం పక్కన పెడితే.. కుషిత తాజాగా నటిస్తున్న చిత్రం బాబు నెం1 బుల్షిట్ గయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన కుషిత హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో కుషిత గుంటూరు కారం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Varun Tej: జనసేనకు సపోర్ట్ చేస్తా, కానీ పవన్ సినిమాలో అలా చేస్తే చంపేస్తారు!
గుంటూరు కారంలో తాను ఓ పాత్ర చేసినట్లు బయటపెట్టింది. అంతే కాదు ఆ సినిమా కోసం నాలుగు రోజులు షూటింగ్ కూడా పూర్తి చేసిందట. కానీ ఏం అయిందో తెలియదు ఫైనల్ అవుట్ పుట్ లో మాత్రం కుషిత పాత్రను గుంటూరు కారం మేకర్స్ లేపేశారు. ఈ విషయం తనను ఎందో బాధించదని.. సినిమా యూనిట్ తనకు అన్యాయం చేశారని బాధను వెల్లడించింది. అయితే తన పాత్రే కాదు.. ఆమెతో నటించిన చాలా మంది పాత్రలు లేపేశారని చెప్పుకువచ్చింది. ఇలా ఇండస్ట్రీలో జరగడం కొత్త కాదని.. ఇది సహజమని అనుకున్నట్లు ప్రెస్ మీట్ లో తెలిపింది. ఇక బాబు నెం1 బుల్షిట్ గయ్ చిత్రం విషయానికి వస్తే.. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. లక్ష్మణ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.