Anchor Varshini: యాంకర్ వర్షిణి సౌందర్య రాజన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఆమె ప్రస్తుతం ఒకపక్క షోలు.. ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగామారింది. ఇక సోషల్ మీడియాలో ఆమె అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో వర్షిణి కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇక గత కొన్నిరోజుల నుంచి వర్షిణికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఆమె.. క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో ఆమె ప్రేమాయణం నడుపుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ మధ్యనే సన్ రైజర్స్.. హైదరాబాద్ టీమ్ కు ఆల్ రౌండర్ గా ఆడిన సుందర్.. నాలుగు మ్యాచులు మాత్రమే ఆడి.. గాయం వలన వెనుతిరిగిన సంగతి తెల్సిందే. అయితే ఈ మ్యాచ్ ఆడే సమయంలో.. జట్టు రూల్స్ బ్రేక్ చేసి.. వర్షిణితో బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అలా వెళ్లడం వలన టీమ్ అతడిపై అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం
ఇక ఈ మధ్య కాలంలో వర్షిణి దాదాపు క్రికెట్ స్టేడియంలోనే కనిపిస్తుంది. సన్ రైజర్స్ టీ షర్ట్ వేసుకొని చీర్ అప్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో వీరి మధ్య ఎఫైర్ నిజమే అని అంటున్నారు. ఇకపొతే వర్షిణి- సుందర్ ప్రేమాయణం నిజమే అయితే కనుక వర్షిణి దశ తిరిగినట్టే అని చెప్పాలి. ఇక గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటలను నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. వర్షిణి గురించి ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అనసూయ కన్నా వర్షిణికే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని, ఆమె రేంజ్ వేరు అని.. వారితో ఆమెను పోల్చడం కష్టమని చెప్పుకొచ్చాడు. ఇక ఢీ షో నుంచి ఆమెను తప్పించి మంచి పనిచేశారని.. ఆమెకు ముందుమంచి భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యాంకర్ గా మాత్రమ గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి.. సుందర్ తో ప్రేమ.. పెళ్ళికి దారితీస్తే.. క్రికెటర్ భార్యగా అంతకన్నా ఎక్కువ గుర్తింపును తెచ్చుకొనే అవకాశం లేకపోలేదు. ఇది కనుక నిజం అయితే.. వేణుస్వామి చెప్పిన మాటలు మరోసారి నిజం కావొచ్చు అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే వర్షిణి నోరు తెరవాల్సిందే.