Varisu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. రంజితమే అంటూ సాగిన ఈ పాటను విజయ్ పాడడం విశేషం.
థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మంచి ఊపును తెస్తోంది. విజయ్ సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ లిస్టులోకి చేరుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు తమిళ తంబీలు. ఇక సాంగ్ కు హైలైట్ ఏదైనా ఉంది అంటే అది రష్మిక అందం మాత్రమే అని అంటున్నారు మరికొందరు. విజయ్ సరసన కలర్ ఫుల్ క్యాస్టూమ్ లో అమ్మడి అందాల ఆరబోత మాములుగా లేదు. ఇక ఎప్పటిలానే జానీ మాస్టర్ , విజయ్ తో హుక్ స్టెప్స్ వేయించి అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. మరి ఈ సినిమాతో విజయ్ హిట్ అందుకుంటుందా..? లేదా..? అనేది చూడాలి.