Valentines Day Special Movies Re Release: ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇంతకు ముందు థియేటర్స్లో విడుదలైన మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్న క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా పలు చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ వాలెంటైన్స్ డే సంధర్భంగా రీ రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికి వస్తే పవన్ కల్యాణ్ సినిమా ‘తొలి ప్రేమ’, సిద్దార్థ్, బేబీ షామిలి జంటగా నటించిన ‘ఓయ్’ సినిమా, హీరో సూర్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో 2008లో వచ్చిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా, పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన ‘సీతారామం’ సినిమాలు ఇప్పటిదాకా బుకింగ్స్ మొదలయ్యాయి.
Bhoothaddam Bhaskar Narayana: నరబలి నేపథ్యంలో భూతద్దం భాస్కర్ నారాయణ.. రాక్షసులే దిగారా ఏంటి?
అలాగే సిద్ధార్, త్రిష జంటగా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, శర్వానంద్, అంజలి జై కాంబినేషన్లో వచ్చిన ‘జర్నీ’ సినిమా కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇవి మాత్రమే కాకుండా బాలీవుడ్ లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘దిల్ తో పాగల్ హై’, ‘మొహబ్బతే’ లాంటి సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. మరి ప్రేమికుల రోజున మీరు ఏ సినిమా చూసేందుకు రెడీగా ఉన్నారో కింద కామెంట్ చేయండి.