Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishnavi: టాలీవుడ్లో ‘బేబీ’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో అమాయకత్వం, ఆధునిక పోకడల నడుమ నలిగిపోయే పాత్రలో అద్భుత నటన కనబరిచి యువత గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి అదే ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన సరికొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన వైష్ణవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమా కథాంశంపై వైష్ణవి మాట్లాడుతూ ఓ కీలకమైన, సెన్సేషనల్ పాయింట్‌ను బయటపెట్టారు. సినిమాలో హీరో హీరోయిన్లు యూకే చదువుల నేపథ్యంలో ‘లివ్-ఇన్ రిలేషన్షిప్’లో ఉంటారనే నిజాన్ని ఆమె స్పష్టం చేశారు. సాధారణంగా లివ్-ఇన్ రిలేషన్ కథలు అంటేనే శృతిమించిన రొమాన్స్, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయనే భావన ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే దీనిపై వైష్ణవి క్లారిటీ ఇస్తూ.. “దర్శకుడు ఆదిత్య హాసన్ గతంలో తీసిన ‘90s’ వెబ్ సిరీస్ అంత క్లీన్‌గా ‘ఎపిక్’ ఉండకపోవచ్చు. ఎందుకంటే కథలో లివ్-ఇన్ రిలేషన్షిప్ ప్రధానాంశం. అయినప్పటికీ కథకు ఏది అవసరమో అంతే చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, హద్దులు దాటకుండా దర్శకుడు చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి నిరభ్యంతరంగా చూడొచ్చు” అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం సితార బ్యానర్లోనే నితిన్ సరసన నటిస్తున్న వైష్ణవి, తమిళంలో రెండు, హిందీలో ఒక ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. లివ్-ఇన్ రిలేషన్షిప్ వంటి యూత్-సెంట్రిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందో చూడాలి!
Also Read
- Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
- Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాడాటర్
- Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని 'ఎపిక్' మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
- Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
తాజావార్తలు
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
-
LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!