Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anaswara Rajan as Ammulu in Chiranjeevi’s Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
నేడు యువ నటి అనస్వర రాజన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కాకా చిత్రబృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో అనస్వర రాజన్ ‘అమ్ములు’ అనే పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రను ఎంబీబీఎస్ విద్యార్థినిగా, చిరంజీవి కూతురిగా పరిచయం చేశారు. ఫస్ట్‌లుక్‌లో అనస్వర సింపుల్, హోమ్లీ లుక్‌లో కనిపిస్తోంది. ఆమె వెనుక చిరంజీవి నిలబడి ఉన్నట్లు పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో సినిమాలో వీరిద్దరి మధ్య ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ ఉండబోతుందనే ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా ‘అమ్ములు’ పాత్ర కథలో కీలకంగా ఉండబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించిన తీరు సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.
Also Read
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ‘కాకా’లో చిరంజీవి వంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం ఆమె కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే అవకాశముంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరికొత్త యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇందులో నివేదా పేతురాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. రాబోయే రోజుల్లో కాకా సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అభిమానులను అలరించనున్నాయి.
Happy Birthday to the
‘HEART OF KAAKA’, Ammulu Paapa, #AnaswaraRajan 🤍#KAAKA Shoot in progress..
Worldwide Grand Release on January 13th, 2027 🔥 pic.twitter.com/BOCBm6kSZg— Kaaka (@KaakaMovie) September 8, 2026
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!