Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandu: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చుట్టూ రోజూ సరికొత్త ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా వివాదాస్పద యూట్యూబర్ నందు హఠాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఏదో సాధారణ పర్యటన కోసమో లేదా సినిమా షూటింగ్ కోసమో రాలేదని, దీని వెనుక అసలు కథ వేరే ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నందు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడం ఖాయమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు ఆమెను రంగంలోకి దించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే, హౌస్‌లోకి అడుగుపెట్టే ప్రక్రియ ఆమెకు అనుకున్నంత సులువుగా సాగడం లేదు.
నందు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అనూహ్యంగా లీగల్ అడ్డంకులు బ్రేకులు వేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. షోలోకి వెళ్లడానికి ముందే ఆమె ఫేక్ వీసా కేసుకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ లీగల్ అడ్డంకులు పూర్తిగా తొలగిపోతే తప్ప ఆమె బిగ్ బాస్ గేట్ దాటడం అసాధ్యంగా మారినట్లు తెలుస్తోంది. నందు హైదరాబాద్ రావడానికి వెనుక అసలు రహస్యం ఈ న్యాయపరమైన వివాదాలేనని ఇండస్ట్రీ టాక్. బిగ్ బాస్ షోలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవడమే లక్ష్యంగా ఆమె నగరంలో అడుగుపెట్టారు. నిబంధనల ప్రకారం ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందస్తుగా ‘లీగల్ క్లియరెన్స్’ పొందేందుకు న్యాయవాదులతో కీలక సంప్రదింపులు జరపడానికి వచ్చారని, అయితే లుకౌట్ నోటీసులు ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే న్యాయపరమైన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నందు అండ్ ఫ్యామిలీ విశ్వాసంతో ఉంది. ఆ క్లియరెన్స్ పత్రాలు చేతికి అందిన వెంటనే, ఏ క్షణమైనా నందు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ స్టేజీపై ప్రత్యక్షమై హౌస్‌మేట్స్‌కు షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!