LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LIC Yuva Term Plan: దేశంలో అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) వివిధ అవసరాలకు అనుగుణంగా అనేక పాలసీలను అందిస్తోంది. రెగ్యులర్ ఇన్కమ్, పెన్షన్ బెనిఫిట్స్, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి విభిన్న ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటిలో LIC Yuva Term Plan కూడా ఒకటి. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో బీమా కవరేజ్ పొందే అవకాశం ఉంది.
18 నుంచి 45 ఏళ్ల వారికి అవకాశం
ఎల్ఐసీ యువ టర్మ్ పాలసీ తీసుకునేందుకు సంస్థ నిర్ణయించిన ప్రవేశ వయసు 18 నుంచి 45 సంవత్సరాలు. ఈ వయసు పరిధిలో ఉన్నవారు ఈ టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. పాలసీ మెచ్యూరిటీ వయసు 33 నుంచి 75 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక పాలసీ టర్మ్‌ను 10 నుంచి 40 సంవత్సరాల వరకు ఎంచుకునే అవకాశం ఉంది. ఈ టర్మ్ ప్లాన్‌లో రూ.50 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5 కోట్ల వరకు సమ్ అష్యూర్డ్ పొందే అవకాశం ఉంది. ప్రీమియం చెల్లింపు విషయంలోనూ LIC మూడు రకాల ఆప్షన్లను అందిస్తోంది. రెగ్యులర్ ప్రీమియం ఎంచుకుంటే పాలసీ కాలవ్యవధి మొత్తం ప్రీమియం చెల్లించాలి. సింగిల్ ప్రీమియం ఆప్షన్లో మొత్తం ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించవచ్చు. అలాగే లిమిటెడ్ ప్రీమియం విధానంలో 20 ఏళ్ల పాలసీ తీసుకున్నప్పటికీ, ఎంపిక చేసుకున్న 10 లేదా 15 సంవత్సరాల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.
Also Read
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
రోజుకు రూ.24తో రూ.50 లక్షల కవర్ ఎలా అంటే..
ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ.50 లక్షల సమ్ అష్యూర్డ్ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ కాలవ్యవధిని 20 ఏళ్లుగా, ప్రీమియం చెల్లింపు వ్యవధిని 10 ఏళ్లుగా ఎంచుకుంటే.. LIC క్యాలిక్యులేటర్ ప్రకారం వార్షిక ప్రీమియం సుమారు రూ.8,750 గా ఉంటుంది. దీనిని రోజువారీ లెక్కలోకి తీసుకుంటే సుమారు రూ.24 అవుతుంది. అంటే రోజుకు దాదాపు రూ.24 చొప్పున కేటాయించడం ద్వారా రూ.50 లక్షల టర్మ్ కవర్ పొందే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవ ప్రీమియం వయసు, పాలసీ ఎంపికలు, ఇతర అర్హతలు, పన్నులు తదితర అంశాలపై ఆధారపడి మారవచ్చని చెబుతున్నారు.
పాలసీదారుడి మరణిస్తే ఎంత ప్రయోజనం..
పాలసీ కాలంలో బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నిబంధనల ప్రకారం నామినీకి డెత్ బెనిఫిట్ అందుతుంది. ప్రీమియం చెల్లింపు విధానాన్ని బట్టి బెనిఫిట్ మారుతుంది. రెగ్యులర్ లేదా లిమిటెడ్ ప్రీమియం ఎంపిక చేసుకున్న సందర్భంలో.. వార్షిక ప్రీమియానికి 7 రెట్లు లేదా చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని డెత్ బెనిఫిట్‌గా చెల్లించే నిబంధన ఉంది. అదే సింగిల్ ప్రీమియం ఎంపిక చేసుకున్నట్లయితే.. చెల్లించిన సింగిల్ ప్రీమియంలో 125 శాతం లేదా పాలసీ నిబంధనల ప్రకారం వర్తించే మొత్తం ప్రయోజనం నామినీకి అందుతుంది.
డెత్ బెనిఫిట్‌ను వాయిదాల్లోనూ పొందొచ్చు
ఈ ప్లాన్‌లో మరో ప్రత్యేక సదుపాయం ఏంటంటే డెత్ బెనిఫిట్‌ను ఒకేసారి కాకుండా వాయిదాల రూపంలో పొందే అవకాశం. నామినీ తనకు అనుకూలంగా 5, 10 లేదా 15 సంవత్సరాల కాలవ్యవధిలో విడతల వారిగా డెత్ బెనిఫిట్‌ను పొందే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. LIC Yuva Term Planను ఇంటి నుంచే ఆన్లైన్లో తీసుకునే అవకాశం ఉంది. LIC అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ పాలసీ వివరాలను పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. అలాగే LIC ఏజెంట్ ద్వారా ఆఫ్లైన్లోనూ పాలసీ తీసుకోవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న ప్రీమియం ఉదాహరణ మాత్రమే. వాస్తవ ప్రీమియం పాలసీదారుడి వయసు, ఎంపికలు, అర్హతలు, పన్నులు, LIC నిబంధనలను బట్టి మారవచ్చు. పాలసీ తీసుకునే ముందు అధికారిక పాలసీ డాక్యుమెంట్‌లోని నిబంధనలు పరిశీలించడం మంచిది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!