Usure : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలు ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించడంలో ఎప్పుడూ విజయవంతమవుతాయి. ఇప్పుడు అలాంటి వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా ‘ఉసురే’ ఆగస్టు 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నవీన్ డి. గోపాల్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో, బకియా లక్ష్మీ టాకీస్ బ్యానర్‌పై మౌళి ఎం. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేయనున్నారు నిర్మాతలు.
Read Also : Narayanan Murthy : అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..
సీనియర్ నటి రాశి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రం గురించి దర్శకుడు నవీన్ డి. గోపాల్ మాట్లాడుతూ, “‘ఉసురే’ ఒక వైవిధ్యమైన ప్రేమకథ. ఇది ఎంతో యథార్థమైన దృక్పథంతో రూపొందింది, ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంటుంది. సమాజంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను తెరకెక్కించాము. రొమాన్స్, కామెడీ, డ్రామాతో కూడిన ఈ చిత్రం ప్రతి అంశంలోనూ ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఉంటుంది. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ‘ఉసురే’ తప్పకుండా నచ్చే చిత్రంగా నిలుస్తుంది,” అని తెలిపారు.
Read Also : Saipallavi : సాయిపల్లవి సీత పాత్రకు సరిపోదంట.. నార్త్ మీడియా అక్కసు..