Saipallavi : ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ తో రాబోతోంది రామాయణ మూవీ. రణ్ బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపిస్తున్నారు. నితేష్ తివారీ డైరెక్షన్ లో వస్తోంది. దాదాపు రూ.900 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ సాయిపల్లవిని పనిగట్టుకుని కొందరు నార్త్ యూట్యూబ్ ఛానెళ్లు, కొందరు బాలీవుడ్ మీడియా వాళ్లు ట్రోల్స్ చేస్తున్నారు. సాయిపల్లవి సీత పాత్రకు సరిపోదంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. కాజల్ రావణుడి భార్యగా, రకుల్ శూర్పనకగా నటిస్తున్నారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తోంది.
Read Also : Siddaramaiah: నాయకత్వ మార్పు లేదని ఎన్ని సార్లు చెప్పాలి.. జర్నలిస్టులపై సిద్ధరామయ్య రుసరుసలు
దీంతో కాజల్ లాంటి అందమైన భార్య ఉండగా రావణుడు అందంగా లేని సాయిపల్లవి కోసం పరితపించడం ఏంటని వెకిలి పోస్టులు పెట్టేస్తున్నారు. పైగా గో వధ చేసే వారిపై గతంలో సాయిపల్లవి సానుభూతి చూపించింది కాబట్టి ఆమెను సీత పాత్రకు తీసుకోవడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ సాయిపల్లవి సీత పాత్రకు న్యాయం చేస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే సీతమ్మ పాత్రలో చేయాలంటే అద్భుతమైన నటన వచ్చి ఉండాలని.. అది సాయిపల్లవికే ఉందంటున్నారు. పైగా ఇతర హీరోయిన్లలాగా సాయిపల్లవి ఎలాంటి ఎక్స్ పోజింగ్, బోల్డ్ పాత్రలు చేయలేదని.. కాజల్, రకుల్ అలాంటి పాత్రలు చేశారని చెబుతున్నారు. సీతమ్మ పాత్రలో చేయడానికి ఉండాల్సిన అన్ని అర్హతలు సాయిపల్లవికి ఉన్నాయంటున్నారు. అందం ముఖ్యం కాదని.. అభినయమే ముఖ్యం అంటూ ఆమెకు మద్దతు ఇస్తూ నార్త్ మీడియాను ఏకి పారేస్తున్నారు.
Read Also : Kannada : అబ్బే రూ. 100కోట్లు ఇవ్వందే సినిమా చేయలేము