Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ చెప్పాలంటే.. ఫ్యామిలీ మ్యాన్ 2 కు ముందు.. ఫ్యామిలీ మ్యాన్ 2 తరువాత అని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు ముందు సామ్ అక్కినేని ఇంటి కోడలు, లేడి ఓరియెంటెడ్ మూవీస్ క్వీన్.. ఇక ఈ సిరీస్ తరువాత చెప్పాలంటే.. గొప్ప నటి, బోల్డ్ బ్యూటీ అని చెప్పుకొస్తారు. ఇక ఏదిఏమైనా అమ్మడి జీవితంలో ఈ సిరీస్ ను ఆమె కాదు అభిమానులు కూడా మర్చిపోలేరు. ఇప్పటికే రెండు సీజన్లతో సందడి చేసిన ఈ సిరీస్.. మూడో సీజన్ కోసం రెడీ అవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సిరీస్ లో సామ్ విలన్ గా కనిపించనుంది.
వచ్చే ఏడాది మొదట్లో సీజన్ -3 మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అంటే అప్పటికి సామ్ పూర్తిగా కోలుకోవచ్చు. ఇక అంతే కాకుండా సీజన్ 3 లో సామ్ కు, మనోజ్ కు మధ్య ఫుల్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయట.. అందుకోసం సామ్ మరోసారి ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నదని టాక్. ఇక తాజాగా మనోజ్ కూడా ఈసిరీస్ లో పాత నటీనటులతో పాటు కొంత మంది కొత్త నటులు భాగమవుతున్నారని చెప్పడంతో ఇంకెవరు వచ్చి యాడ్ అవుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో సామ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ సిరీస్ తో సామ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.