Site icon NTV Telugu

Ram Charan – Upasana : ఉపాసనకు ట్విన్స్.. మెగా ఇంట్లో డబుల్ ధమాకా..

Ramcharan Upasana Secind Baby

Ramcharan Upasana Secind Baby

Ram Charan – Upasana : మెగా స్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కోడలు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే కదా. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీపావళి రోజున ఉపాసన సీమంతం కూడా నిర్వహించారు. దీంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో డబుల్ ధమాకా విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఉపాసనకు ట్విన్ బేబీస్ అని తెలిసింది.

Read Also : Fauzi : పాండవ పక్షం నిలిచిన కర్ణుడు.. ఫౌజీపై క్రేజీ అప్డేట్

ఈ విషయాన్ని ఉపాసన తల్లి శోభన సోషల్ మీడియాలో తెలిపింది. ఉపాసన సీమంతం వీడియోను పోస్టు చేసిన ఆమె.. ఈ ఏడాది ఇదే తనకు అత్యంత సంతోషకరమైన విషయం అని తెలిపింది. వచ్చే ఏడాది ఉపాసన, రామ్ చరణ్‌ కు ట్విన్ బేబీస్ రాబోతున్నారని బయట పెట్టింది. ఇంకేముంది ఈ వీడియోను చూసిన వారంతా మెగా కుటుంబానికి డబుల్ ధమాకా అంటూ కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి కోరిక ప్రకారం రామ్ చరణ్‌ కు కొడుకు పుట్టాలంటూ పోస్టులు పెడుతున్నారు.

Read Also : Dude : రూ.100 కోట్ల క్లబ్ లో డ్యూడ్.. హ్యాట్రిక్ అందుకున్న ప్రదీప్

Exit mobile version