Fauzi : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఫౌజీ. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 1932లో బ్రిటీష్ కాలం నాటి ఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైన్యంలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఒక్కడే ఒక సైన్యం అన్నట్టు రాసుకొచ్చారు. కాగా పోస్టర్ ను మార్నింగ్ టైమ్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
Read Also : Janhvi Kapoor : రామ్ చరణ్, ఎన్టీఆర్ మీదనే జాన్వీకపూర్ ఆశలు..
పద్మవ్యూహం గెలిచిన పార్థుడు, పాండవ పక్షం నిలిచిన కర్ణుడు, గురువే లేని ఏకలవ్యుడు, పుట్టుకతోనే వీడొక యోధుడు అంటూ ప్రభాస్ పాత్ర గురించి ఎలివేషన్ రాసుకొచ్చారు. అంటే ప్రభాస్ పాత్ర పురాణాల్లో కర్ణుడిలా ఉంటుందన్నమాట. పురాణాల్లో కర్ణుడు కౌరవుల తరఫున పోరాడాడు. కానీ ఇక్కడ ఈ కర్ణుడు మాత్రం పాండవుల పక్షమే నిలిచాడని చెప్పారు. ఏకలవ్యుడు విలు విద్యలో ఎంత ప్రతిభావంతుడో.. యుద్ధంలో ఇక్కడ ప్రభాస్ అంతకన్నా ప్రతిభావంతుడు అని చెబుతున్నారు. పుట్టుకతోనే వీడొక యోధుడు అంటే.. ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్న పాత్రలో నటిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
Read Also : Dude : రూ.100 కోట్ల క్లబ్ లో డ్యూడ్.. హ్యాట్రిక్ అందుకున్న ప్రదీప్
పద్మవ్యూహం గెలిచిన పార్థుడు
Padmavyuham gelichina Parthuduపాండవ పక్షం నిలిచిన కర్ణుడు
Pandava paksham nilichina Karnuduగురువే లేని ఏకలవ్యుడు
Guruve leni Ekalavyuduపుట్టుకతోనే వీడొక యోధుడు
Puttukathone veedoka yodhuduఫౌజీ#Fauzi ❤️🔥
— Fauzi (@FauziTheMovie) October 23, 2025