Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఉపాసన.. తమ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్స్, గ్రాండ్ పేరెంట్స్ ను కలవడం.. రామ్ చరణ్ ఫొటోస్, క్లింకార అప్డేట్స్.. ఇలా ప్రతిదీ ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఉపాసన.. క్లింకార చెల్లెళ్లను అభిమానులకు పరిచయం చేసింది. అదేంటి క్లింకార కు చెల్లెళ్లు లేరుగా అనుకుంటున్నారా..? ఉపాసన చెల్లెలి పిల్లలు క్లింకారకు చెల్లెళ్లు అవుతారు కదా. వారే వీరు. ఉపాసన చెల్లి అనుష్పల ట్విన్స్ కు జన్మనిచ్చింది. అనుష్పల డిసెంబర్ 2021 లో అర్మాన్ ఇబ్రహీంను వివాహమాడింది.
ఇక గతేడాది చివర్లో అనుష్పల ప్రెగ్నెంట్ అవ్వగా.. ఈ మధ్యనే ఆమె కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఇక తాజాగా వారి నామకరణం ఫంక్షన్ లో మిస్టర్ సి ఫ్యామిలీ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన షేర్ చేసింది. “అద్భుతమైన, అందమైన ముగ్గురు సిస్టర్స్ ను పరిచయం చేస్తున్నాం.. క్లింకార తన చెల్లెళ్లు అయిన ఐరా పుష్పా ఇబ్రహీం మరియు రికా సుచరిత ఇబ్రహీంతో చేరిపోయింది” అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటోలో .. క్లింకారను చరణ్ ఎత్తుకోగా.. ఐరా పుష్పా ఇబ్రహీం & రికా సుచరిత ఇబ్రహీం లను వారి పేరెంట్స్ ఎత్తుకొని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ పిక్ అని కొందరు.. క్లింకారకు తోడు దొరికింది.. ఆడుకోవడానికి అని కొందరు చెప్పుకొస్తున్నారు.
Introducing the awesome threesome – power puff girls🩷
Klinkaara Konidela is joined by her 2 sisters
Ayraa Pushpa Ebrahim & Ryka Sucharita Ebrahim pic.twitter.com/ChUodsLuwN— Upasana Konidela (@upasanakonidela) February 12, 2024