UI The Movie: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించాడు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యూఐ పేరుతో వస్తున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్నేళ్లు అయినా ఉప్పీ యూనిక్ స్టైల్ మారలేదు అనడానికి ఈ సినిమానే నిదర్శనం అని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రోమో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నీకంటే నాది పెద్దది, వాడికంటే నీది చిన్నది .. చీప్ .. చీప్ సాంగ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యి.. ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో అందరికి తెల్సిందే. ఇక దీనికి మించిన ట్రోల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అసలు ఈ సాంగ్ వింటే.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అని కాకుండా..ఉపేంద్రకు తప్ప ఇలాంటి ఐడియాలు రావు అని అనేస్తారు. అదేంటి అంటారా.. ఒక్కసారి పాట వినండి.. మీమ్స్ లో ఉన్న ట్రోల్స్ మొత్తం ఈ ఒక్క సాంగ్ లోనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. జగన్ నుంచి కుమారి ఆంటీ వరకు ఎవరిని వదలలేదు. పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడ్రా ఆపేది, సీఎం జగన్ నేను ఉన్నాను, నేను విన్నాను.. చంద్రబాబు కుర్చీని మడతపెట్టి డైలాగ్.. బాలకృష్ణ సర్ సర్లే ఎన్నో అనుకుంటాం.. అఖిల్ అయ్యగారి నెంబర్ వన్.. కుమారి ఆంటీ రెండు లివర్లు ఎక్స్ట్రా.. బోయపాటి హైప్.. త్రివిక్రమ్ రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్లిపోతున్నా.. బర్రెల్లక్క, మల్లారెడ్డి పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా డైలాగు.. ఇలా దేన్నీ వదలలేదు. ఫేమస్ అయ్యినవాళ్లనే ట్రోల్ చేస్తారని ఒక్క లైన్ లో చెప్పుకొచ్చాడు. ఇలా ఏదైనా చేసి బాగా ఫేమస్ అయ్యి హీరోను కలవాలి అని హీరోయిన్ పాడే సాంగ్ ఇది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు రాంబాబు గోసాల లిరిక్స్ అందించాడు. ఇక ఈ ట్రోల్ సాంగ్ పై సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ మొదలయ్యాయి. ఎలా భయ్యా ఇంత తెలివిగా ఆలోచించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో వింటేజ్ ఉపేంద్ర హిట్ కొడతాడో లేదో చూడాలి.
#UITheMovie
Troll Song – Telugu meme references 🤣 pic.twitter.com/mb7LvpUVGm— SSrMB (@ssmbbakthudu) March 4, 2024