Heroines in KP Chowdary Drugs Case: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాలు తెర మీదకు వచ్చిన దాఖలాలు లేవు కానీ తాజాగా ఈ డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ పోలీసులు ఇటీవల డ్రగ్స్ కేసులో రోషన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో లభించిన ఆధారాలతో కేపీ చౌదరి కూడా ఈ నెట్ వర్క్ లో భాగమని గుర్తించారు. గత ఏడు సంవత్సరాలుగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలోని పలువురితో సంబంధాలు ఏర్పరచుకున్న కేపీ చౌదరి గోవా, హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌ల్లో ఏర్పాటు చేసే ప్రైవేటు పార్టీలకు పలువురు నటులను కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ అయిన వారి ఫోన్లలో లభించిన కాల్‌డేటా ఆధారంగా కొనుగోలుదారుల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Chiranjeevi : దటీజ్ మెగాస్టార్ చిరంజీవి అనకుండా ఉండలేరు!
వాట్సాప్ ద్వారా జరిగిన వ్యవహారాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కేపీ చౌదరి ఫోన్లలో ఇద్దరు హీరోయిన్లు, నలుగురు నటీమణులు, ప్రముఖ దర్శకుడి ఫోన్ నంబర్లు వారి ఫొటోలను గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక వారికి ఈ మత్తు దందాతో సంబంధం ఉందా లేదా అని పరిశీలిస్తున్నారు. ఇక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కేపీ చౌదరి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు భావిస్తున్నారు పోలీసులు. ఇక కేపీ చౌదరికి చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు టచ్ లో ఉన్నారని కూడా పోలీసులు గుర్తించారు. టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారంలో ఉన్న హీరోయిన్లు, ప్రముఖ డైరెక్టర్ ఎవరు అన్నది ఎప్పుడు వెలుగులోకి వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.