బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పై బాలీవుడ్ ఖిలాడీ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి కరణ్ ను బ్యాన్ చేయాలంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. అర్రే ఇదేంటీ.. ఆమెకు అంత అన్యాయం కరణ్ ఏమి చేశాడు.. ఎందుకు అంత ఘోరంగా మాట్లాడింది అంటే.. కరణ్ తన పార్టీలతో హ్యాంగోవర్ ఇస్తున్నాడట.. ఉదయం ఆమె లేవడానికి ఇబ్బంది పడుతుందట.. అందుకే కరణ్ ను బ్యాన్ చేస్తే పార్టీలు ఉండవు.. అమ్మడు హ్యాపీగా ఉండొచ్చు అని ఆమె అర్ధం..ఇప్పుడు అర్ధం అయ్యిందా.. ఇదంతా దేని గురించో.. ఇటీవలే కరణ్ జోహార్ తన 50 వ పుట్టినరోజును ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కరణ్ ప్రైవేట్ పార్టీలకు పెట్టింది పేరు.. ఆయన పార్టీ అనగానే ఎక్కడ ఉన్నా పనులను కూడా పక్కకు పెట్టి వాలిపోతారు బాలీవుడ్ తారలు.. ఎందుకంటే ఈ బడా నిర్మాత ఇచ్చే పార్టీ అలా ఉంటుంది మరి. ఇక అర్ద శతాబ్ధాన్ని పూర్తిచేసుకొనే పార్టీ ఎలా ఉంటుంది.. అంగరంగ వైభవంగా ఈ వేడుక మొదలయ్యింది.
బాలీవుడ్ స్టార్ జంటలు రాత్రి అంతా మద్యం మత్తులో మునిగి తేలారు.. ఇక బర్త్ డే బాయ్, హీరోయిన్లతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ చిందులేశారు. ఈ పార్టీలో కరణ్ జోహార్ తో కలిసి రణ్ వీర్ సింగ్ చేసిన హంగామా మామూలుది కాదు. ఇక ఈ పార్టీకి అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో హాజరయ్యాడు. ఇక ఆ పార్టీలో ట్వింకిల్ ఖన్నా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక ఉదయం మాత్రం అమ్మడు హ్యాంగోవర్ తో తలా పట్టుకుంది. ఆ ఫ్రస్టేషన్ లో ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా లో అర్థ్రరాత్రి వరకు జరిగిన కరణ్ బర్త్ డే పార్టీలో మందు తాగానని ఆ హ్యాంగోవర్ పోవడం లేదని ఇలాంటి పార్టీని ఏర్పాటు చేస్తున్న కరణ్ జోహార్ ని బ్యాన్ చేయాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారందరూ.. ఆయన పిలిస్తే వెళ్లిపోవడమేనా.. నీకు లిమిట్ ఉండాలి గా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.