Anushka Shetty: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఏ హీరో హీరోయిన్ అయినా ప్రయోగాలు చేయడానికి వెనుకాడరు. ఎందుకంటే అలా ప్రయోగాయాలు చేసినప్పుడే వారిలో ఉన్న నిజమైన ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు డీ గ్లామర్ రోల్స్ చేయడానికి హీరోయిన్లు భయపడేవారు.. ఆ తరువాత ఒక ప్రయోగంగా ఒక హీరోయిన్ చేయడంతో అది ట్రెండ్ అయ్యింది. ఇక ఇలాంటి ప్రయోగాలు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఉన్నాయి. ఒక సినిమాకు లావు అవ్వడం.. మరో సినిమాకు తగ్గడం చూస్తూనే ఉంటాం. అది పాత్రకు కావాలి అంటే హీరో హీరోయిన్ ఎవరైనా ఓకే చెప్పేస్తారు. సినిమా హిట్ అయితే వారి కష్టం గురించి అందరు మాట్లాడుకుంటారు.. ప్లాప్ అయితే ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు అనుకుంటారు. కానీ, ఒక ప్రయోగం వలన కెరీర్ తో పాటు ఆరోగ్యం కూడా పోగొట్టుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. స్వీటీ.. ఒక యోగా టీచర్. సూపర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ అందం గురించి చెప్పనవసరం లేదు. బికినీలో అమ్మడి అందాల ఆరబోతను చూశాం.. అరుంధతి లో జేజమ్మగా చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కూడా చూశాం.
Pawan Kalyan: మావయ్యకే మంచిచెడు చెప్తున్నావా.. సాయి బాబు
ప్రయోగాలు చేయడంలో అనుష్కకు సాటి లేదు. అరుంధతి లో జేజమ్మగా అందరి చేత దండం పెట్టించుకున్న స్వీటీ తన తదుపరి సినిమాలో ఒక్కసారిగా బికినీ లో కనిపించి షాక్ ఇచ్చింది. అరుంధతి లో కనిపించిన ఆమెనా .. ఈమె అనుకొనేలా చేసింది. హీరోలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు, కటౌట్లు, పాలాభిషేకాలు.. ఆ రోజుల్లో అనుష్క చేసిన సాహసాలు అన్ని ఇన్ని కావు. అయితే అనుష్క కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు.. సైజ్ జీరో సినిమా చేయడం. అదొక ప్రయోగం. అమ్మాయిలు డైట్ అంటూ కడుపు మాడ్చుకొని కొన్ని బరువు తగ్గించే కంపెనీల చుట్టూ తిరగడం, వారు ఇచ్చిన అడ్డమైన టాబ్లెట్స్ వేసుకొని మృత్యువాత పడుతూ ఉంటారు. అందం అంటే బరువు కాదని, మానసిక సౌందర్యం ముఖ్యమని.. లావుగా ఉన్నామని కాదు.. ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది చూడాలి అనే కథతో రాఘవేంద్ర రావు తనయుడు కోవెలమూడి ప్రకాష్ దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం సైజ్ జీరో.
Subi Suresh: ప్రముఖ యాంకర్ కమ్ నటి మృతి
ఇక ఈ సినిమా కథ నచ్చడంతో స్వీటీ వెంటనే ఒప్పుకోవడం.. లావు అవ్వడం కోసం ఎలా పడితే అలా తినేసి బరువు పెరిగింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. అప్పటినుంచి అనుష్క శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడం మొదలయ్యింది. బాగా బరువు పెరిగి పోతూ కనిపించింది. ఇక బరువు తగ్గించడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేమి అమ్మడికి కలిసిరాలేదు. కొన్ని రోజులు తగ్గి కనిపించినా.. అది ఎక్కువ రోజులు ఉండడం లేదు. ఇక ఈ మధ్యనే ఆమె మహా శివరాత్రి ఉత్సవాల్లో కనిపించింది. కొంచెం బరువు పెరిగి కనిపించడంతో మరోసారి నెటిజన్ల చూపు స్వీటీ మీద పడింది. ఇంకేముంది మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. స్వీటీ ఏంటి ఇలా అయిపోయింది. అయ్యో యోగా టీచర్ ఎలా ఉండేది ఎలా అయిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.. ఇక చాలామంది సైజ్ జీరో మేకర్స్ ను తిట్టిపోస్తున్నారు.దుర్మార్గుల్లారా.. ఎలాంటి ఫిగర్ ను ఎలా చేసేశారురా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకముందు కాలంలో స్వీటీని మునుపటి స్వీటీలా చూడలేమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో యువీ క్రియేషన్స్ వారు ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాలో స్వీటీ ఎలా ఉంటుందో చూడాలి.