Trisha Krishnan: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇటీవలే ఆమె మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ లో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గత కొన్నిరోజులుగా త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతుందని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై త్రిష స్పందించకపోయేసరికి నిజమేనేమో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే అందులో ఏ నిజం లేదని త్రిష తల్లి మీడియా ముందు చెప్పుకొచ్చింది.
త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలను త్రిష ఉమా కృష్ణన్ ఖండించారు. తన కూతురుకు పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పారు. “ప్రస్తుతం త్రిష దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. రాజకీయాలలో చేరుతోంది అని వస్తున్న వార్తలో నిజం లేదు. అసలు ఈ వార్తలు ఎవరు సృష్టించారో తెలియడంలేదు. అన్ని భాషల్లో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవడానికే నా కూతురు కష్టపడుతోంది” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో ఈ వార్తలకు చెక్ పడిందని చెప్పాలి. మరి ఈ వార్తలపై త్రిష పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ లో నోరువిప్పుతుందేమో చూడాలి.