Tovino Thomas files complaint against social media trolls on him:మలయాళంలో తల్లుమాల, 2018, మిన్నల్ మురళి వంటి సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టిన నటుడు టోవినో థామస్ ఇప్పుడు అనూహ్యంగా వెలుగులోకి వచ్చారు. అయితే ఈసారి ఆయన తన సినిమాల వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల లైమ్‌లైట్‌లోకి రావడం గమనార్హం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ టోవినో థామస్ ఇటీవల ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. టోవినో థామస్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకుళం పనంగాడ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అందుతున్న సమాచారం మేరకు టొవినో థామస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అవమానకరమైన వ్యాఖ్యలు వస్తున్నాయని పేర్కొంటూ సిటీ పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు.
Nora Fatehi In Matka: ‘మట్కా’ కోసం హైదరాబాద్‌లో నోరా ఫతేహి
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన పరువు తీస్తున్నారని చెబుతూ అభ్యంతరకరమైన కంటెంట్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌లను కూడా పోలీసులకు ఇచ్చారని, కేసులో కీలకమైన సాక్ష్యంగా ఇవి పని చేస్తాయని అంటున్నారు. కమిషనర్ తదుపరి విచారణ నిమిత్తం కేసును పనంగాడ్ పోలీసులకు బదిలీ చేశారు. ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్న వారిలో టోవినో మొదటి వ్యక్తి ఏమీ కాదు. ఇక సినిమాల విషయానికి వస్తే టోవినో థామస్ ప్రస్తుతం జీన్ పాల్ లాల్ దర్శకత్వంలో ‘నడికర్ తిలకం’ చిత్రంలో నటిస్తున్నారు. సౌబిన్ షాహిర్ సరసన తెరకెక్కుతున్న చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో టోవినో థామస్ డేవిడ్ పడిక్కల్ అనే సూపర్ స్టార్ అనే పాత్రలో నటించనున్నారు. మలయాళంలో రూపొందుతున్న ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది.