Nora Fatehi In Matka: ‘మట్కా’ కోసం హైదరాబాద్‌లో నోరా ఫతేహి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nora Fatehi Came Hyderabad For Pan India Movie Matka: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ను భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రారంభోత్సవ వేడుక కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో నోరా ఫతేహి కి డ్యాన్స్ నంబర్ ఉంటుందని ఆమె పాత్ర చాలా కీలకమైనదని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ, సినిమాలో ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటించడానికి ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అంటున్నారు. 1958-1982 మధ్య కాలంలో జరిగే ఈ సినిమా కథలో వైజాగ్ అమ్మాయిగా నటించడం పెద్ద ఛాలెంజ్ గా భావిస్తోంది నోరా ఫతేహి.
Deepak Malakar: కాస్టింగ్ డైరెక్టర్ అరాచకం.. అందుకు అంగీకరించలేదని తలపగలకొట్టి!
Also Read
ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం హైదరాబాద్ వచ్చారు, మరో మూడు రోజుల పాటు ఆమె టీమ్‌తో సమయం వెచ్చించనున్నారు. ముందు నోరాకి లుక్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఆమె తన పాత్ర ప్రిపరేషన్ కోసం వర్క్‌షాప్‌లో పాల్గోన్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాక నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ వింటేజ్ సెట్‌ను నిర్మించనున్నట్టు సినిమా టీమ్ చెబుతోంది. ముఖ్యంగా రు. 60వ దశకంలోని వాతావరణాన్ని, అనుభూతిని రీ క్రియేట్ చేసేందుకు సినిమ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రియా సేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వరుణ్ తేజ్‌కి మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన మట్కా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?