యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటిన బ్యూటీ అనసూయ వెండితెరపై కూడా దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ స్టార్ యాంకర్ పాత్ర కోసం గుండు గీయించుకోవడానికి కూడా సిద్ధం అంటోంది. రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేసుకున్న అనసూయ ఆ తరువాత వరుస అవకాశాలను పట్టేస్తుంది. ‘రంగస్థలం’లో ఆమె నటన, అభినయం చూసిన మేకర్స్ సైతం తమ సినిమాల్లో కీలక పాత్రల కోసం అనసూయను సంప్రదిస్తున్నారు. విశేషం ఏమిటంటే ‘రంగస్థలం’తో తన కెరీర్ ను మార్చేసిన దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మరోసారి నటించే అవకాశం దక్కించుకుంది అనసూయ. ఈరోజు ఉదయం “పుష్ప” చిత్రం నుంచి అనసూయ ఫస్ట్ లుక్ విడుదలైంది. దాక్షాయణిగా అనసూయ సరికొత్త పాత్రలో కన్పించింది. ఆమె చేతిలో మరికొన్ని తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.
Read Also : “పుష్ప” : పొగరుబోతు దాక్షాయణిగా అనసూయ లుక్
ఇక విషయంలోకి వస్తే… అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో లైవ్ ఇంటరాక్షన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా అనే ఏదైనా పెద్ద ప్రాజెక్ట్‌లో మంచి పాత్ర దొరికితే గుండు కొట్టించుకోవడానికి సిద్ధమేనా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ “తప్పకుండా.. అవసరమైతే.. సరే” అంటూ సమాధానం చెప్పింది. ఎంత పెద్ద పాత్ర అయినా, ప్రాజెక్ట్ అయినా గుండుతో నటించడానికి నటీమణులు పెద్దగా ఇష్టపడరు. కానీ అనసూయ మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం గుండుకు తాను సిద్ధమే అంటోంది.
